బిగ్ బ్రేకింగ్…మెహ‌రీన్ ని ఇబ్బంది పెట్టిన హీరో తండ్రి

బిగ్ బ్రేకింగ్...మెహ‌రీన్ ని ఇబ్బంది పెట్టిన హీరో తండ్రి

0
83

హీరో నాగ‌శౌర్య కి ఈ ఏడాది అశ్వ‌థ్థామ చిత్రం మంచి హిట్ ఇచ్చింది.. ఇందులో మెహ‌రీన్ న‌టించింది
శాగ‌శౌర్య తండ్రి శంక‌ర్ ప్ర‌సాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా.. త‌ల్లి ఉష నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.. సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆశించిన మేర‌ ఫ‌లితాల‌ను రాబ‌ట్టుకోలేదు.. కాని వ‌సూళ్లు బాగానే వ‌చ్చాయి.

అయితే తాజాగా ఇప్పుడు ఓ వార్త మాత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది…అశ్వ‌థ్థామ‌ ప్ర‌మోష‌న్స్‌లో ఓ కార్య‌క్ర‌మానికి మెహ‌రీన్ హాజ‌రు కావాల్సి ఉంది. కానీ ఆమెకు అల‌ర్జీ సోక‌డంతో తాను స‌ద‌రు ప్రోగ్రామ్‌కు హాజ‌రు కాలేన‌ని శంక‌ర్ ప్ర‌సాద్‌కు చెప్పింది.

కాని హీరో తండ్రి మాత్రం ఊరుకోలేద‌ట‌, మీరు ప్రోగ్రామ్ కు రావాల్సిందే అని చెప్పార‌ట‌..రాక‌పోతే హోట‌ల్ బిల్స్ పే చేయ‌న‌ని బెదిరించాడ‌ట‌. ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌క‌పోవ‌డంతో చెప్ప పెట్ట‌కుండా హోట‌ల్ ఖాళీ చేసి వెళ్లిపోయింద‌ట‌. దీంతో ఈ విష‌యం వెంట‌నే హోటల్ సిబ్బంది అత‌నికి ఫోన్ చేసి చెప్పార‌ట‌, వెంట‌నే అత‌నే ఆ బిల్లు క‌ట్టార‌ట‌, కాని ఈ వార్త ఎంత వ‌ర‌కూ వాస్త‌వ‌మో చూడాలి.