మేమున్నామంటు ముందుకొచ్చిన సినిమా హీరోలు

మేమున్నామంటు ముందుకొచ్చిన సినిమా హీరోలు

0
91

కరోనా నివారణకు చిత్ర పరిశ్రమకు చెందిన వారు విరాళం ప్రకటించారు… ఎవరెవరు ఎంత విరాళం ప్రకటించారో ఇప్పుడు చూద్దాం… హీరో పవన్ కళ్యాణ్ 2 కోట్లు అందులో కోటి కేంద్రంకు 50 లక్షలు ఏపీకి మరో 50 లక్షలు తెలంగాణకు విరాళంగా ప్రకటించారు.. అలాగే హీరో రామ్ చరణ్ 70 లక్షలు… ఇరు తెలుగు రాష్ట్రాలకు విరాళంగా ప్రకటించారు..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరు తెలుగు రాష్ట్రాలకు కోటి విరాళం ప్రకటించారు… మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ 20 లక్షలు విరాళంగా ప్రకటించారు… దర్శకుడు వీవీ వినాయక్ చిత్ర పరిశ్రమలో పని చేసేవారికి 5 లక్షలు విరాళం ప్రకటించారు…

హీరో ప్రభాస్ పీఎం రిలీఫ్ ఫండ్ కు 3 కోట్లు అలాగే ఇరు తెలుగు రాష్ట్రాలకు కోటి విరాళం ప్రకటించారు…హీరో ఎన్టీఆర్ 75 లక్షలు ఇరు తెలుగు రాష్ట్రాలకు 50 లక్షలు చిత్ర పరిశ్రమలో పని చేసేవారికి 25 లక్షలు ప్రకటించారు..

అలాగే నిర్మాత దిల్ రాజు 20 లక్షలు, హీరో నితిన్ 20 లక్షలు, మెగాస్టార్ చిరంజీవి కోటి, నందమూరి బాలకృష్ణ కోటి, సాయిదరమ్ తేజ్ 10 లక్షలు, కొరటాల శివ 10 లక్షలు విరాళంగా ప్రకటించారు…