వైట్ల పై ఆసక్తి చూపని యంగ్ హీరో.. ఇప్పుడు అయన పరిస్థితీ ఏంటి..!!

వైట్ల పై ఆసక్తి చూపని యంగ్ హీరో.. ఇప్పుడు అయన పరిస్థితీ ఏంటి..!!

0
91

హిట్ లు ఉన్నప్పుడు దర్శకుడి పై యంగ్ హీరో లు మనసుపారేసుకుని సినిమా చేయమని కోరుకోవడం పరిపాటే.. కానీ వారికి ఫ్లాప్ లు వచ్చినప్పుడే ఫోన్ లు కూడా ఎత్తరు.. ఇప్పుడు సరిగ్గా అదే ఎదురవుతుంది దర్శకుడు శ్రీను వైట్ల కు.. మొదట్లో హిట్ ల మీద హిట్లు ఇచ్చిన వైట్ల ప్రస్తుతం గత కొన్ని సినిమాలు గా భారీ పరాజయాలను మూటగట్టుకుంటున్నాడు.

అయితే మళ్ళీ ఓ సినిమా చేయాలనీ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో చాలా మంది హీరోల దగ్గరకు తిరిగి చివరికి… బెల్లంకొండ శ్రీనివాస్ ను పట్టుకున్నాడు. ఇటీవల ఓ కథని సిద్ధం చేసుకుని బెల్లంకొండ శ్రీనివాస్ కు వినిపించాడట. కథ విన్న బెల్లంకొండ ఇంకా తన డెసిషన్ ఏంటనేది చెప్పలేదట. ఇక బెల్లంకొండ రెస్పాన్స్ కోసమే శ్రీను వైట్ల వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుంది. చాలా సినిమాల తర్వాత ‘రాక్షసుడు’ తో ఓ హిట్ అందుకుని కొంత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ టైములో శ్రీనువైట్లతో సినిమా అవసరమా అని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.