మొటిమల నివారణకు లాలాజలం : తమన్నా షాకింగ్ కామెంట్

0
85

మిల్కీ బ్యూటీ అనగానే ఠక్కున గుర్తొచ్చే భామ తమన్నా. ఆమె సౌత్ ఇండియా చిత్రాల్లో తోపు హీరోయిన్ గా రికార్డుల మోత మోగిస్తున్నది. మిల్కీ బ్యూటీ తన చర్మ సౌందర్యంపై ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ఒక మ్యాగజైన్ కు తమన్నా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో మొహంపై మొటిమల నివారణకు తాను ఉమ్మిని వాతానంటూ కామెంట్ చేసింది. తన స్కిన్ కేర్ ఐటమ్స్ లో మార్నింగ్ సైలవా ను కూడా ఉపయోగిస్తానని వివరించింది.

ఉదయాన్నే నిద్ర లేవగానే తన నోట్లోని లాలాజలం (సలైవా)న మొహంపై అప్లై చేస్తానని చెప్పింది. అంతేకాదు నోట్లోని లాలాజలం స్కిన్ ప్రాబ్లమ్స్ ను తొలగించడంలో బాగా పనిచేస్తుందని పేర్కొంది.

తమన్నా చెప్పేది కొద్దిగా షాకింగ్ గా ఉందంటున్నారు నెటిజన్లు. చాలామందికి మొహంపై మొటిమలు, నల్లమచ్చలు ఏర్పడతాయి కానీ వాటిని తగ్గించుకోవడానికి తమన్నా లాగా లాలాజలం వాడేవారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. ఎంతైనా జుట్టున్నమ్మ ఏ కొప్పు వేసినా చెల్లుతుందన్నట్లు… అందమైన భామ కాబట్టి ఆమె ఏమి చెప్పినా జనాలు నమ్ముతూనే ఉంటారని అనుకోక తప్పదు.

తమన్నా ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాలో నటిస్తోతంది.  అలాగే నితిన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా మ్యాస్ట్రో అనే చిత్రంలో నటిస్తోంది.