Minister Roja | చెర్రీ కంగ్రాట్స్.. నిన్ను ఎత్తుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి: రోజా

-

కొన్ని నెలల క్రితం మెగాస్టార్ చిరంజీవి గురించి మంత్రి రోజా(Minister Roja) చేసిన వ్యాఖ్యలు ఎంత వివాదం సృష్టించాయో తెలిసిందే. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) పైనా ఆమె తరుచూ విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. దీంతో మెగా కుటుంబం ఆమెను దూరంగా ఉంచారు. ఈ క్రమంలో చిరంజీవి(Chiranjeevi) మరోసారి తాత కావడంపై శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేయడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కొణిదెల వారి ఇంటికి ప్రిన్సెస్ రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana) దంపతులకు అభినందలు చెప్పారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ‘తాతయ్య అయిన చిరంజీవి గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఎప్పటికీ యవ్వనంగా ఉంటూ, శక్తివంతంగా వికసిస్తూ ఉండే వ్యక్తి మెగా కుటుంబంలోకి ఒక అందమైన ప్రిన్సెస్ రావడం ఆ భగవంతుడి ఆశీర్వాదం. డియర్ రామ్ చరణ్, నువ్వు చంటిపిల్లాడిగా ఉన్నప్పుడు నిన్ను నా చేతుల్లోకి తీసుకుని హత్తుకున్న రోజులను గుర్తుచేసుకుంటున్నాను. ఇప్పుడు నీకు కూతురు పుట్టిందనే వార్త విని చాలా సంతోషించాను. చిరంజీవి సార్, తాతయ్య అనే ప్రతిష్టాత్మక బిరుదు మీకు వచ్చినా.. మీరు ఎప్పటికీ తిరుగులేని హీరోనే. ఉపాసనకు నా ఆశీర్వాదాలు ఉంటాయి.మీ ఇంట్లో అడుగుపెట్టిన చిట్టి మహాలక్ష్మికి క్షేమం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తాను’అని రోజా(Minister Roja) పేర్కొన్నారు.

- Advertisement -

Read Also:
1. వైసీపీ ఎమ్మెల్యేలకు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన జగన్!!
2. ‘పేదలను హింసించి జగన్‌ పైశాచిక ఆనందం పొందుతున్నారు’

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...