మైత్రీ మేకర్స్ మరో బిగ్ ప్రాజెక్ట్

మైత్రీ మేకర్స్ మరో బిగ్ ప్రాజెక్ట్

0
98

టాలీవుడ్ లో ఛ‌లో సినిమాతో హిట్ కొట్టి త‌ర్వాత నితిన్ తో భీష్మ సినిమా చేస్తున్నారు క్రియేటివ్ డైరెక్ట‌ర్ వెంకి కుడుముల‌, తాజాగా భీష్మ టీజర్ కు భలే బజ్ వచ్చింది. సోషల్ మీడియా అంతా ట్రెండ్ అవుతోంది. అప్పుడే ఈ సినిమా సేల్ గురించి చర్చ జరుగుతోంది అంటే నిర్మాతలకు కాసుల పంటే అని చెప్పాలి.
ఇక ఈ సక్సస్ పరంపర అలాగే కొనసాగించేలా ఉన్నారు వెంకీ, తాజాగా ఆయనకు మూడో చిత్రం ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు తెలుగులో బడా నిర్మాణ సంస్ధ అంటే వెంటనే చెప్పేది మైత్రీ మూవీ మేకర్స్.. తాజాగా వారితో వెంకీ మూవీ చేయనున్నారట, ఆయన డైరెక్షన్ లో చిత్రం ఫిక్స్ అయింది అని తెలుస్తోంది, అయితే ఇంకా హీరోని ఫైనల్ చేయాల్సి ఉంటుంది. నాని లేదా నాగ చైతన్య, సాయితేజ్ కు సూట్ అయ్యే కధ రెడీగా ఉందట. దీంతో మైత్రీ టీం వారితో చర్చలు జరిపి వెంకితో సినిమాకి సిద్దం అవుతోంది అని తెలుస్తోంది. ఇప్పటికే వెంకి కుడుములతో సైన్ చేయించుకుందట మైత్రీ మేకర్స్, మరి చూడాలి కథ ఫైనల్ ఎవరికి అవుతుందో.