ప్రభాస్ తాజాగా చేస్తున్న సినిమా టైటిల్ గురించి ఇప్పటి వరకూ చర్చ జరిగింది… కాని ఆ టైటిల్ జాను నిర్మాత దిల్ రాజుకి ఇవ్వడం జరిగింది, అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ విషయంలో చిత్ర యూనిట్ ప్లాన్ చేసి, రెండు టైటిల్స్ రిజిస్టర్ చేయించింది అని వార్తలు వినిపిస్తున్నాయి.
రాధే శ్యామ్ .. ఓ డియర్ అనే టైటిల్స్ ను వీరు సెలక్ట్ చేశారు అని తెలుస్తోంది.. అయితే ఈ సినిమాలో సీనియర్ నటులు కూడా నటిస్తున్నారు అని తెలుస్తోంది..ఇటీవల ప్రభాస్ సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. దాదాపు ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది..
ఖర్చుకు నిర్మాతలు కూడా వెనకాడటం లేదట… ఇక చాలా భాషల్లో ప్రభాస్ సినిమాలకు మార్కెట్ ఉంది కాబట్టి ప్రీ మార్కెట్ కూడా భాగానే జరుగుతోంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో కృష్ణంరాజు ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు… ఇకమైనే ప్యార్ కియా ఫేమ్ భాగ్యశ్రీ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కూడా కీలక రోల్ చేయనున్నారట. మరి ప్రభాస్ తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి అని అంటున్నారు అభిమానులు.