చిరంజీవి సినిమాలో మోహ‌న్ బాబు – క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్

చిరంజీవి సినిమాలో మోహ‌న్ బాబు - క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్

0
115

చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్లో సినిమా రూపొందుతోంది, ఇక చిత్ర షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.. ఈ సినిమా షూటింగ్ వంద రోజుల్లో పూర్తి చేయాలి అనే ఆలోచ‌న‌తో చిత్ర యూనిట్ ప‌నులు వేగంగా చేస్తోంది. ఈసినిమాలో చ‌ర‌ణ్ కూడా న‌టిస్తున్నారు అని వార్త‌లు వినిపించాయి.. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి అయిన త‌ర్వాత ఆయ‌న షూటింగ్ లో జాయిన్ అవ్వ‌నున్నార‌ట‌.

అయితే మ‌రో వార్త కూడా వినిపించింది.. ఇందులో న‌టుడు మోహ‌న్ బాబు కీల‌క రోల్ చేయ‌నున్నారు అని వార్త‌లు వ‌చ్చాయి.. సోష‌ల్ మీడియాలో ఆయ‌న లుక్ కు సంబంధించి పోస్ట‌ర్ కూడా విడుద‌ల అయింది, తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు చిత్ర యూనిట్.

ఈ సినిమాలో మోహన్ బాబు నటించడం లేదని స్పష్టం చేశారు. మోహన్ బాబుకి తగిన పాత్ర తమ సినిమాలో లేదనీ, అలాంటి పాత్రే గనుక వుంటే తప్పకుండా సంప్రదించేవారమని అన్నారు… అయితే చిరు మోహ‌న్ బాబు గ‌తంలో కొన్ని పాత్ర‌లు క‌లిసి చేశారు. మ‌ళ్లీ తెర‌పై ఇద్ద‌రిని చూడ‌వ‌చ్చు అని అభిమానులు అనుకున్నారు. కాని ఆశ‌లు అడియాశ‌లు అయ్యాయి.