సినిమాల్లో పోటీ ఉండాలి అప్పుడే సరికొత్త విభిన్న సినిమాలు ప్రజల ముందుకు వస్తాయి.. ఇక సీనియర్ నటులు చాలా మంది ఇప్పుడు ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.. అలాగే మంచి పాత్రలు చేస్తున్నారు, తాజాగా చిరు సినిమాలో మంచు మోహన్ బాబు నటిస్తున్నారు అనే వార్త వినిపించింది.
అంతేకాదు టాలీవుడ్ లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే దానికి బలం చేకూరేలా …సోషల్ మీడియాలో ఇప్పుడెక్కడ చూసినా ప్రముఖ నటుడు మోహన్ బాబు కొత్త గెటప్ కు సంబంధించిన ఫొటో సందడి చేస్తోంది. రఫ్ లుక్, మెడలో రుద్రాక్షలు, పులిగోరు పతకం తో కనిపిస్తున్నారు ఈ పిక్ లో..
ఇప్పుడు ఈ ఫోటో చూసిన వారికి ఎవరికైనా కచ్చితంగా ఆయన కొత్త సినిమాలో నటిస్తున్నారు అనేది అర్దం అవుతోంది.. కలెక్షన్ కింగ్ న్యూ లుక్ మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం కోసమేనని టాక్ బలంగా వినిపిస్తోంది. కొరటాల శివ ఇప్పటికే మోహన్ బాబుతో ఈ సినిమా గురించి చర్చించారట, తాజాగా ఫోటో షూట్ జరిగింది అని తెలుస్తోంది. అయితే మోహన్ బాబు రోల్ ఏమిటి అనేది మాత్రం రిలీల్ అవ్వడం లేదు. మరి ఈ ఫోటో వెనుక స్టోరీ చిత్ర యూనిట్ ప్రకటిస్తే క్లారిటీ రానుంది.