సినిమాలపై అధికారికంగా ప్రకటన వచ్చేవరకూ నమ్మడం లేదు చాలా మంది…. ఎందుకు అంటే పుకార్లు మాత్రం చాలా వరకూ షికారు చేస్తున్నాయి… ఆ సినిమాలో వీరు ఈ సినిమాలో వారు అంటూ అనేక వార్తలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి… చాలా మంది సీనియర్ నటులని కూడా కొన్ని కీలక పాత్రల్లో తీసుకుంటున్నారు అంటూ అనేక వార్తలు వైరల్ చేస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు పై కూడా ఇలాంటి వార్తలు గత నెల రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఆయన ఆచార్య సినిమాలో నటిస్తున్నారు అని అంతేకాదు మరో ఇద్దరు హీరోల సినిమాల్లో కూడా నటిస్తున్నారు అని వార్తలు వినిపించాయి.
దీనిపై తాజాగా మోహన్ బాబు పీఆర్ ఓ క్లారిటీ ఇచ్చారు.. సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రస్తుతం సన్ ఆఫ్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తప్ప మరే చిత్రాన్ని అంగీకరించలేదని తెలిపారు, ఈ మధ్య కొత్త చిత్రాలు అంగీకరించారు అని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు అని తెలిపారు. ఏ కొత్త సినిమా అంగీకరించినా అధికారికంగా తెలియచేస్తామన్నారు.