రజనీకాంత్ అభిమానులకి కీలక విషయం చెప్పిన మోహన్ బాబు

-

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారు అని అందరూ ఎదురుచూశారు .. కాని ఆయన రాజకీయాల్లోకి రావడం లేదు అని రాజకీయాల్లో లేకుండా ప్రజాసేవ చేస్తాను అని తెలిపారు… అయితే డిసెంబర్ 31 న కొత్త పార్టీ అనౌన్స్ మెంట్ అని వేచి ఉన్న వేళ ..రజనీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు… అయితే రజనీకాంత్ కు మన టాలీవుడ్ లో డైలాగ్ కింగ్ మోహన్ బాబు మంచి మిత్రుడు అనే విషయం తెలిసిందే.

- Advertisement -

ఇది చాలా సార్లు ఇద్దరూ తెలియచేశారు. ఇద్దరూ మంచి మిత్రులు వాడు.. వీడు అంటూ ఇప్పటికీ చనువుగా పిలుచుకునేంత అనుబంధం వీరిది. ఆరోగ్యం సహకరించక రజనీ రాజకీయ పార్టీ పెట్టడం లేదు అని తెలిపారు.. సోషల్ మీడియా ద్వారా తన మిత్రుడికి మద్దతుగా మోహన్ బాబు అందరికీ బహిరంగ విన్నపం చేశారు.

నా మిత్రుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడం అభిమానులందరికీ బాధే అయినప్పటికీ తన ఆరోగ్యం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మంచిదని నమ్ముతున్నారు. రజనీకాంత్ చాలా మంచివాడు, చీమకు కూడా హాని చేయని వ్యక్తి …నువ్వు రాజకీయాలకు పనికిరావు నిక్కర్చిగా మాట్లాడే వ్యక్తివి నువ్వు ఈ రాజకీయాలు చేయలేవు, ఇప్పుడు నిన్ను మంచివాడు అన్న నోళ్లు రేపు చెడ్డవాడు అంటారు. రాజకీయ బురద అంటుకోకుండా ఉండటం మంచిది అని తెలిపారు… అభిమానులు అందరూ సహృదయంతో నా మిత్రుడి నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని తెలిపారు మోహన్ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...