బాలయ్యను కలిసిన మోహన్​బాబు..అతని ఓటమిపై సంచలన వ్యాఖ్యలు

Mohan Babu, Vishnu who met Balayya

0
107

సినీ పెద్దలందరితో కలిసి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ అభివృద్ధి కోసం పాటుపడతానని నటుడు, ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తనకు మద్దతుగా నిలిచిన నందమూరి బాలకృష్ణను తొలిసారి కలిశారు. తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి గురువారం(అక్టోబర్​ 15) ఉదయం బాలయ్య ఇంటికి వెళ్లారు. ‘మా’ అభివృద్ధి, శాశ్వత భవన నిర్మాణం వంటి అంశాలపై బాలకృష్ణతో చర్చించారు.

భేటీ అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ..బాలకృష్ణ ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి. ఆయన్ని కలవడం ఆనందంగా ఉంది. అన్నయ్య యన్‌.టి.రామారావు నన్ను బాలయ్య ఇంటికి పంపించినట్లు ఉంది. గత సాధారణ ఎన్నికల సమయంలో మంగళగిరిలో బాలయ్య అల్లుడు లోకేశ్‌ ఓటమికి ప్రచారం చేశా. కానీ, ఆయన అవేమీ మనసులో పెట్టుకోకుండా ‘మా’ ఎన్నికల్లో విష్ణుకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. విష్ణుకి ఓటు వేసి గెలిపించారు. ‘మా’ భవన నిర్మాణంలోనూ విష్ణుకి తోడుగా ఉంటానని చెప్పారు” అని తెలిపారు.

విష్ణు మాట్లాడుతూ..తాను త్వరలోనే మెగాస్టార్‌ చిరంజీవిని కలవనున్నట్లు చెప్పారు. “ఈ నెల 16న ‘మా’ అధ్యక్షుడిగా నేను ప్రమాణ స్వీకారం చేయనున్నాను. ఆ కార్యక్రమానికి ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందర్నీ ఆహ్వానిస్తున్నానని తెలిపారు.