Mohan Babu | ఆ రాజకీయ నేతలకు మోహన్ బాబు వార్నింగ్

-

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు(Mohan Babu) కొంత మంది నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల పలువురు నాయకులు తన పేరుని రాజకీయంగా వాడుకోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. అలాంటి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

- Advertisement -

“ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నారని నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలిగాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తూ.. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ.. మీ మోహన్ బాబు(Mohan Babu)” అని రాసుకొచ్చారు.

కాగా ఇటీవల వైసీపీ నేత, ఏపీ ఫిల్మ్ డెవల్‌పెమెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ మోహన్‌బాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. హెరిటేజ్ సంస్థ మోహన్‌బాబుది అని.. ఆయనను బెదిరించి చంద్రబాబు కుటుంబం లాక్కొందని ఆరోపించారు. దీంతో పోసాని వ్యాఖ్యలపైనే ఆయన ఇలా స్పందించారని చెబుతున్నారు.

Read Also: త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన వైసీపీ కీలక నేతలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

YS Sharmila | ‘నవ సందేహాలు’ పేరుతో సీఎం జగన్‌కు షర్మిల మరో లేఖ

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సీఎం జగన్‌కు 'నవ సందేహాల'...

Andhra Pradesh | ఏపీలో మొత్తం ఓటర్లు ఎంత మంది అంటే..?

ఏపీ(Andhra Pradesh)లో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర...