Mohan Babu | ‘రక్షణ కల్పించండి’.. పోలీసులను ఆశ్రయించిన మోహన్ బాబు..

-

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu), ఆయన రెండో కుమారుడు మంచు మనోజ్(Manchu Manoj) మధ్య కొన్ని రోజులుగా తీవ్ర వివాదం నెలకొంది. ఆస్తి పంపకాల విషయంలోనే వారి మధ్య గొడవ మొదలైందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మనోజ్‌పై బౌన్సర్లతో మోహన్ బాబు దాడి చేయించారంటూ మనోజ్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా తాజాగా తన రెండో కుమారుడు మనోజ్‌పై మోహన్ బాబు.. రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. తన కుమారుడు మనోజ్, అతని భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు హాని కల్పించే ఆలోచనలో తన రెండో కుమారుడు, అతని అనుచరులు ఉన్నారని, ఈ క్రమంలో అసాంఘిక శక్తులుగా మారిన కొందరి నుంచి తనకు రక్షణ కల్పించాలని రాచకొండ కమిషనర్‌కు చేసిన ఫిర్యాదులో మోహన్ బాబు కోరారు.

‘‘నేను జల్‌పల్లిలో పదేళ్లుగా నివసిస్తున్నా. నాలుగు నెలల క్రితం నా రెండో కుమారుడు ఇల్లు వదిలి వెళ్లాడు. తాజాగా మనోజ్ కొందరు సంఘ వ్యతిరేక శక్తులతో కలిసి నా ఇంటి దగ్గర ఉద్రిక్తత సృష్టించాడు. మనోజ్ తన 7 నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్ లోని నా కార్యాలయంలోకి 30 మంది చొరబడి సిబ్బందిని బెదిరించారు.

మనోజ్, మౌనికక నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకొని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నా భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయం భయంగా ఉంది. వాళ్లు నాకు హాని కలిగించే ఉద్దేశంతో ఉన్నారు. నా నివాసాన్ని శాశ్వతంగా ఖాళీ చేయాలని బెదిరించారు. సంఘ విద్రోహులుగా మారి నా ఇంట్లో ఉన్న వారికి ప్రాణహాని కలిగిస్తున్నారు. చట్టవిరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి కుట్రలు పన్నుతున్నారు.

నేను 70ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్‌ని. మనోజ్, మౌనిక, అతడి అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి. నా ఇంట్లో ఎలాంటి భయం లేకుండా గడపడానికి రక్షణ కల్పించండి’’ అని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా తాజాగా ఈ అంశంపై సూపర్ స్టార్ రజనీ కాంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మోహన్ బాబు(Mohan Babu) కుటుంబీకులకు ఫోన్ చేసి ఈ వివాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

Read Also: 25 ఏళ్ల తిరిగి ఇండియాకు వచ్చిన స్టార్ హీరోయిన్.. ఎందుకోసమో..?
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...