స్టార్ హీరో తో తలపడబోతున్న మోహన్ బాబు.. మళ్ళీ కథ మొదటికొచ్చిందే..!!

స్టార్ హీరో తో తలపడబోతున్న మోహన్ బాబు.. మళ్ళీ కథ మొదటికొచ్చిందే..!!

0
127

తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చి..ఆ తర్వాత విలన్‌గా టర్న్ తీసుకొని..ఆపై కమెడియన్‌గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసిన నటుల్లో మోహన్ బాబు ఒకరు. గత కొన్నేళ్లుగా హీరోగా మోహన్ బాబు కెరీర్ ఏమంత బాగోలేదు. ఆ మధ్య కథానాయకుడిగా నటించిన ‘గాయత్రి’ మూవీ రిలీజైన సంగతే ఆడియన్స్‌కు తెలియదు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ మూవీలో ఎస్వీఆర్ పాత్రలో నటించి మెప్పించారు. అలాంటి మోహన్ బాబు .. త్వరలో వెండితెరపై మళ్లీ విలన్ గా కనిపించనున్నారు. తమిళంలో సూర్య కథానాయకుడిగా సుధా కొంగర ఒక సినిమా చేస్తోంది.

‘సూరరై పోట్రు’ టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో విలన్ పాత్ర విలక్షణంగా వుంటుందట. అందువల్లనే మోహన్ బాబును దర్శక నిర్మాతలు సంప్రదించడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయిది. చెన్నై ఎయిర్ పోర్టులో మోహన్ బాబు కాంబినేషన్లోని సన్నివేశాలను రేపు చిత్రీకరించనున్నారట. అందువల్లనే మోహన్ బాబు నిన్ననే అక్కడికి వెళ్లారని చెబుతున్నారు. తమిళంతో పాటు తెలుగులో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.