బిగ్ బాస్ లో ఈ వారం హౌస్ నుంచి మోనాల్ గజ్జర్ ఎలిమినేట్ అయింది. మొత్తానికి 14 వ వారం ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చేసింది, ఇక మోనాల్ బయటకు వెళ్లిన సమయంలో హౌస్ లో అఖిల్ బాధ చెప్పలేనిది, అఖిల్ ఎంతో బాధపడ్డాడు, అఖిల్, సోహెల్ అభిజీత్, హారిక, అరియాన టాప్-5కి వెళ్లినట్లు నాగార్జున ప్రకటించారు.
అయితే గత నాలుగు వారాలుగా మోనాల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుంది అని అందరూ భావించారు. చివరకు 14 వారం మోనాల్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది,ఇక ఆమె వెళుతూ వెళుతూ అఖిల్ కు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది.
అఖిల్‌కు ఎల్లో రోజ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. అతడిని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఈ 14 వారాలు మోనాల్ ఉండటంతో అఖిల్ మోనాల్ మంచి స్నేహితులుగా ఉన్నారు.. వీరిమధ్య ఏదో ఉంది అని అందరూ భావించారు.. మరి చివరి వారం ఆట ఎలా ఉంటుందో చూడాలి.. ఇటు టాప్ 5 లో ఎవరు ఫైనల్ విన్నర్ అనేది చూడాలి, సో మోనాల్ నిన్ను కలుస్తా నీకు ఓ విషయం చెప్పాలి అంటూ చివరన అఖిల్ చెప్పడంతో అతని ఫ్యాన్స్ ఆ విషయం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారు.