ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్(Adipurush)’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడంతో థియేటర్లన్నీ జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగుతున్నాయి. థియేటర్ల దగ్గర జాతరను తలిపించే వాతావరణం కనిపిస్తోంది. మరోవైపు ప్రతి థియేటర్‌లో హనుమంతుడి కోసం ఓ సీటును ఖాళీగా ఉంచుతున్న సంగతి తెలిసిందే. కొన్ని థియేటర్లలో అయితే ఏకంగా హనుమంతుడి విగ్రహంతో పాటు శ్రీరాముడి ఫొటోలు కూడా పెట్టారు. అయితే ఈ సినిమా చూసేందుకు ఓ కోతి థియేటర్‌కు రావడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాక్షాత్తు హనుమంతుడే వచ్చి సినిమా చూశారని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.