నారప్పతో కార్తీక్ రత్నంకు మరింత క్రేజ్ – ఆయనతో నటించాలనుందట‌

More craze for Karthik Ratnam with Narappa movie

0
120
karthik ratnam

విభిన్నమైన కథలు సినిమాలో అలాంటి పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు కార్తీక్ రత్నం. ఇప్పుడు ఎక్కడ చూసినా అతని పేరే వినిపిస్తోంది.గ్రామీణ నేపథ్యంలో రూపొందే సినిమాల కోసం ఆయనను తీసుకుంటున్నారు. దీనికి బాగా సెట్ అవుతున్నారు అని ఇటు సినిమా అభిమానులు టాలీవుడ్ ప్రముఖులు కూడా అంటున్నారు. చాలా నేచురల్ గా అతని నటన ఉంటుంది.

కార్తీక్ రత్నం అనగానే ముందుగా మనకు గుర్తు వచ్చేది కేరాఫ్ కంచరపాలెం సినిమా. ఈ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. దీంతో ఆయనకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. అందులో నటన చాలా బాగుంటుంది. ఇటీవల వచ్చిన అర్థ శతాబ్దం కూడా ఆయనకి మంచి పేరును తెచ్చిపెట్టింది.

ఇక ఈరెండు సినిమాల్లో ఆయన నటన నచ్చి నారప్ప సినిమాలో అవకాశం ఇచ్చారు. ఇక ఇందులో నారప్ప కొడుకు పాత్ర చేశారు మునికన్న‌ పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. కథ అంతా కూడా ఆయన పాత్ర చుట్టూ తిరగడం వలన సినిమాలో చాలా మంచి పేరు వచ్చింది. అగ్రసీవ్ పాత్రని బాగా చేశారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నాని గారి నటన అంటే నాకు చాలా ఇష్టం .ఆయనతో కలిసి ఒక్క సీన్ చేసినా చాలు అని అన్నారు. చూడాలి మరి ఆ కోరిక ఎప్పుడు తీరుతుందో.