ఓటీటీలో ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

'Most Eligible Bachelor' in OTT .. When is the streaming?

0
106

యంగ్ హీరో అఖిల్‌ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. ఈ సినిమాలో హాట్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. రొమాంటిక్‌ లవ్‌స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో సినిమా లాభాలతోనే బిజినెస్‌ ముగిసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. గీతాఆర్ట్స్‌-2 బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆహా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.

దసరా కానుకగా అక్టోబర్‌ 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రాన్ని నవంబర్‌ 19న ఆహాలో విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని ఆహాతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా విడుదల చేస్తుండడం విశేషం.