‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తో హిట్ ఖాయం: అఖిల్

Impressive ‘Most Eligible Bachelor’ Trailer

0
116

యంగ్ హీరో అక్కినేని అఖిల్, హాట్ బ్యూటీ పూజా హేగ్దే జంటగా నటిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అందరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. అక్టోబర్ 15న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

మన లైఫ్ పార్టనర్‌తో కనీసం 9000 నైట్స్ కలిసి పడుకోవాలి. వందల వెకేషన్స్‌కి వెళ్లాలి. అన్నిటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అలాంటివాడెవడు’’ అని పూజా హెగ్డే ఓ సమావేశంలో చెబుతున్న డైలాగ్‌తో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ‘ఒక అబ్బాయి లైఫ్‌లో 50 పర్సంట్ కెరియర్, 50 పర్సంట్ మ్యారీడ్ లైఫ్. మ్యారీడ్ లైఫ్ బాగుండాలంటే..కెరియర్ బాగుండాలి అంటూ లైఫ్ పార్టనర్‌లో ఏం కావాలో తెలిసినప్పుడు టెన్షన్ ఎందుకు? అనే ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు అఖిల్‌ను చూపించారు.

బొమ్మరిల్లు భాస్కర్..మరోసారి ‘బొమ్మరిల్లు’ తరహాలోనే ఈ చిత్రాన్ని తీసినట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటి వరకు సరైన హిట్ లేని అఖిల్ ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొడతా అనే ధీమాను వ్యక్తం చేస్తున్నాడు.

మీరు కూడా ఈ ట్రైలర్ ను చూసేయండి..