సినిమా పరిశ్రమలో చాలా మంది వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారిని చూశాం… ఇక హీరోల కుమారులు స్టార్ హీరోలు అయ్యారు.. మరికొందరు హీరోయిన్లు తమ కుమార్తెలను సినిమా పరిశ్రమకు తీసుకువచ్చారు హీరోయిన్లని చేశారు, ఇక అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కూడా చిత్ర సీమలో ఉన్నారు.. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేస్తోంది.
అయితే ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది తాజా ఇంటర్వ్యూలో..అతిలోక సుందరి శ్రీదేవీ తనయ జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. శ్రీదేవికి తన కూతురు జాన్వీ కపూర్ డాక్టర్గా ఎదగాలని ఎంతో కోరిక ఉండేదట. ఇక ఆ విషయాన్ని కూతురికి చెప్పింది డాక్టర్ అవ్వాలి అని కోరింది… అయితే జాన్వీ మాత్రం వైద్య విద్యను అభ్యసించే తెలివితేటలు తన దగ్గర లేవని చెప్పడంతో కుటుంబ సభ్యులు సినిమాల్లోకి వెళ్లడానికి ఒప్పుకున్నారట.
తాను చిన్న తనం నుంచి ఇంట్లో సినిమా వారిని చూస్తూ పెరిగాను… నాకు నటించాలి అని కోరిక నాటి నుంచి వచ్చింది.. అందుకే తాను వైద్య విద్యకు సరిపోను అని చెప్పాను.. దీంతో తర్వాత నన్ను సినిమాల్లో నటించేందుకు ఒకే చెప్పారు
తాను డాక్టర్ కావాలనుకున్న అమ్మ కోరికను తీర్చలేకపోయానని వాపోయింది జాన్వీకపూర్.. బాలీవుడ్ లో ఆమె
ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.