‘మా’ ఎన్నికల్లో చిరు ఫ్యామిలీ మద్దతు ఎవరికంటే?

0
134

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికల సందడి మామూలుగా లేదు. జనరల్ ఎలక్షన్స్ ను మించిపోయేలా కనబడుతున్నది. అసలే గ్లామర్ ప్రపంచం… అందులోనూ హేమాహేమీలు పోటీలో ఉంటున్నారు కాబట్టి తెలుగు సినీ ప్రేక్షకులందరికీ ఈ ఎన్నికలపై అమితమైన ఆసక్తి కలుగుతున్నది.

సాధారణంగా ఎన్నికలు అంటే ముఖ్యమైన వాళ్లు ఎవరికి సపోర్ట చేస్తారోనన్న ఆసక్తి ఉంటుంది. ఈ ఎన్నికల్లో మెగాస్టార్ర చిరంజీవి కుటుంబంపైనే అందరి ఫోకస్ ఉన్నది. చిరు ఫ్యామిలీకి బయట ఎంత ఫాలోయింగ్ ఉందో సినీ ఆర్టిస్టుల్లో కూడా అంతే ఫాలోయింగ్ ఉంది. చాలా మంది ఆర్టిస్టులు చిరంజీవిని దేవుడిలా కొలుస్తారు. ఈ పరిస్థితుల్లో చిరంజీవి కుటుంబం నుంచే చాలామంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు. చిరంజీవి తనయుడు, రామ్ చరణ్, నాగ బాబు తోపాటు ఆయన కుమారుడు, కుమార్తె, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బన్నీ ఇలా కుటుంబసభ్యుల ఓట్లే డజన్ల కొద్దీ ఉన్నాయి.

అయితే విశ్వసనీయ సమాచారం మేరకు చిరంజీవి ఫ్యామిలీ మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు సపోర్ట్ చేయవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో వారి మధ్య అండర్ స్టాండింగ్ కూడా కుదిరినట్లు చెబుతున్నారు. చిరు ఫ్యామిలీ సపోర్ట్ తో ప్రకాశ్ రాజ్ దుమ్ము దులిపేసినా ఆశ్చర్యం అక్కర లేదని అంటున్నారు.

అయితే చిరంజీవి సామాజికవర్గం కాపు అయినందున కమ్మ సామాజికవర్గం సినీ పెద్దలంతా వారి సామాజిక వర్గానికే మద్దతు ఇచ్చే అవకాశాలున్నట్లు ప్రచారం ఉంది. ఎక్కడా లేని కుల పిచ్చి కూడా సినిమాల్లో ఉండడంతో కులాల మధ్య ఓట్ల చీలిక ఉండే చాన్స్ ఉంది.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు సుమారు వెయ్యి వరకు ఉంటారు. 950 వరకు ఓట్లు పోలయ్యే అవకాశాలుంటాయి. దీంతో ఎవరు ఎవరి వైపు ఉంటారోనన్న ఆసక్తి ఇప్పుడు తీవ్రంగా ఉంది.

‘మా’ ఎలక్షన్స్ లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లిస్ట్ ఇదే

మా ఎన్నికల హడావిడి మామూలుగా లేదు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయన టీమ్ సభ్యులను తాజాగా ప్రకటించారు. తన టీంలో ఎవరెవరు పోటీ చేయబోతున్నారో వారి లిస్ట్ కింద చూడొచ్చు.

1 ప్రకాశ్ రాజ్

2 జయసుధ

3 శ్రీకాంత్

4 బెనర్జీ

5 సాయి కుమార్

6 తనీష్

7 ప్రగతి

8 అనసూయ

9 సన

10 అనితా చౌదరి

11 సుధ

12 అజయ్

13 నాగనీడు

14 బ్రహ్మాజీ

15 రవి ప్రకాశ్

16 సమీర్

17 ఉత్తేజ్

18 బండ్ల గణేష్

19 ఏడిద శ్రీరామ్

20 శివారెడ్డి

21 భూపాల్

22 టార్జాన్

23 సురేష్ కొండేటి

24 ఖయ్యుం

25 సుధీర్

26 గోవిందరావు

27శ్రీధర్ రావు

 

హేమ ఎలా పోటీలోకి దిగారో కింద వార్త ఉంది చదవండి…

‘మా’ అధ్యక్ష పోటీలో మరో సీనియర్ మహిళా నటిమణి