విడుదలకు సిద్ధమవుతున్న ‘మామా ఏక్‌ పెగ్‌లా’

-

భార్గవ్‌ వర్మ, అరవింద్‌ ప్రకాశ్‌, రాజేష్‌రెడ్డి, రవికుమార్‌, మాధురి కీలక పాత్రధారులుగా లివితా యూనివర్సెల్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘మామా ఏక్‌ పెగ్‌లా’. సంతోష్‌ మనోహర్‌ దర్శకత్వంలో ‘కమలతో నా ప్రయాణం’ లాంటి చిత్రాన్ని నిర్మించిన సునీల్‌ రెడ్డి ఇసనాక నిర్మిస్తున్న చిత్రమిది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ఉంది. ‘‘యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇటీవల విడుదల చేసిన ‘మామా ఆల్కహాల్‌ అంథమ్‌’ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. మాస్‌ యాంగిల్‌లో సాగే ఈ పాటను కడలి రచించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడారు. సామ్యూల్‌ జెబి సంగీతం అందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని నిర్మాత తెలిపారు.

- Advertisement -

నటీనటులు–సాంకేతిక నిపుణులు

భార్గవ్‌ వర్మ, అరవింద్‌ ప్రకాశ్‌ కోనేటి, రాజేష్‌రెడ్డి, రవికుమార్‌, మాధురి, రవితేజ, అవినాష్‌ మద్దిలా, ఆర్‌.కె.నాయుడు, విరాజిత, జోషువా, గిరిధర్‌ పైడి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కో–ప్రొడ్యూసర్స్‌: జస్మితా రెడ్డి ఎం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌: రవితేజ ఎం, రవి నాని.కె, సినిమాటోగ్రఫీ: ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి, వెంకట్‌ గిరీష్‌, సంగీతం: సామ్యూల్‌ జెబి, ఎడిటర్‌: వి.నాగిరెడ్డి, వెంకట్‌ బాల, పీఆర్వో: సాయి సతీష్‌ ,  రాంబాబు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...