ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్స్..అతిధులు ఎవరంటే?

Muhurtam fix for Prabhas 'Radheshyam' pre-release event..who are the guests?

0
108

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 23న హైదరాబాద్​లోని రామోజీఫిల్మ్ సిటీ వేదికగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ కార్యక్రమానికి అభిమానులే అతిథులుగా హాజరవుతారని పేర్కొంటూ సర్ ప్రైజ్ ఇచ్చింది.

ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు ‘రాధేశ్యామ్’పై ఆసక్తి రేకెత్తిస్తుండగా ట్రైలర్, సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న ‘రాధేశ్యామ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రభాస్ అభిమానులు ఈ వేడుకలకు రానున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలకు కచ్చితంగా పాటించాలని చిత్రబృందం సూచించింది. ఇదే వేదికపై 5 భాషల్లో రాధేశ్యామ్ ట్రైలర్​ను విడుదల చేయనున్నారు.

అయితే ఈ సినిమాలో చాలా సర్​ప్రైజ్​లు ఉన్నాయని రాధాకృష్ణ కుమార్ ఇటీవల వెల్లడించారు. ప్రభాస్​ నటన ఈ సినిమాలో అద్భుతంగా ఉంటుందని, సినిమా మొత్తం అతడు కళ్లతో నటించేశాడని ఈ డైరెక్టర్ చెప్పుకొచ్చారు. సెట్​లో ప్రభాస్ చిన్నపిల్లాడిలా ఉంటారని, ఈ సినిమాలో డార్లింగ్ వన్​ మ్యాన్ షో చూస్తారని రాధాకృష్ణ చెప్పారు.

‘రాధేశ్యామ్’లో మొత్తం 16 పాత్రలు ఉంటాయని చెప్పిన రాధాకృష్ణ ప్రభాస్​ తల్లిగా అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ నటించారని అన్నారు. అలానే ఓ కీలకపాత్రలో కృష్ణంరాజు కనిపిస్తారని అదే పాత్రను ఉత్తరాదిలో సత్యరాజ్ చేశారని తెలిపారు.