మునుపెన్నడు లేని డిఫరెంట్ లుక్ లో అల్లు అర్జున్

మునుపెన్నడు లేని డిఫరెంట్ లుక్ లో అల్లు అర్జున్

0
95

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ తన లెక్కలతో సినిమాల బాక్సాఫీస్ లెక్కలను మార్చేస్తుంటారు… వన్ సైడ్ లవ్ అనే కొత్త కాన్సెప్ట్ తో ఆర్య సినిమా తీశాడు.. ప్రేక్షకులు కూడా అందుకోలేని స్థాయిలో వన్ నేనొక్కడినే లాంటి సినిమాలు తీశాడు సుకుమార్… నాన్నకు ప్రేమతో అంటూ మనసు పెట్టి రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా తీశాడు…

అయితే రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సుక్కు నుంచి మరో సినిమా విడుదల కాలేదు… ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఒక మాస్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు… ఇదిలా ఉండగా ఈ లెక్కల మాస్టర్ కి కొన్ని సెంటిమెంట్లు కూడా ఎక్కువేనట… సినిమా ఇండస్ట్రీ లో సెంటిమెంట్ కి కాంబినేషన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న విషయం తెలిసిందే…

తాజాగా ఈ లిస్ట్ లో చేరిపోయారు దర్శకుడు సుకుమార్…స్వతహాగా ఎప్పుడు గడ్డం పెంచుకుని ఉండే సుక్కు తన సినిమాలో హీరోలకి కూడా గుబురు గడ్డం ఉండేలా చూస్తాడు.. నాన్నకు ప్రేమతో రంగస్థలం సినిమాలో దీనికి ఉదాహరణ… ఇప్పుడు అల్లుఅర్జున్ కూడా గుబురు గడ్డంతో దర్శనం ఇస్తారని అందరు చర్చించుకుంటున్నారు…