Allu Arjun: అల్లు అర్జున్‌ని ఎందుకు సన్మానించలేదు.. మురళీమోహన్ వ్యాఖ్యలు వైరల్‌..

-

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా, నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్వహించిన ‘సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్’ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు పలువురు నటులు, నటీమణులు దర్శకులు, నిర్మాతలు, తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవిని ప్రముఖులు ఘనంగా సత్కరించారు. అల్లు అరవింద్, టీజీ విశ్వప్రసాద్‌, మురళీమోహన్‌, తనికెళ్ల భరణి వంటి ప్రముఖులు చిరుని శాలువాతో సత్కరించారు.

- Advertisement -

అనంతరం ఈ వేడుకలో సీనియర్ నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ ఇండస్ట్రీ పెద్దలపై మండిపడ్డారు. 69 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ సాధించాడని ప్రశంసించారు. అలాంటి నటుడిని కనీసం ఇండస్ట్రీ పెద్దలు సన్మానించకుండా గౌరవం ఇవ్వలేదని అసహనం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ చెన్నైలో ఉన్నప్పుడు ఇలా ఉండేది కాదంటూ ప్రముఖుల తీరుని ఎండగట్టారు. ఇప్పుడు కనీసం చిరంజీవిని అయినా సత్కరించడం సంతోషమని తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...