రజినీ కాంత్ సినిమా పై మురుగదాస్ లేటెస్ట్ ట్వీట్

రజినీ కాంత్ సినిమా పై మురుగదాస్ లేటెస్ట్ ట్వీట్

0
103

రజినీ కాంత్ సినిమాలు అంటే అభిమానుల హుషార్ ఏ రేంజులో ఉంటుందో తెలిసింది.. క్రియేటీవ్ సోషియల్ డైరెక్టర్ మురుగదాస్ ఆయనతో దర్బార్ సినిమా చేశారు .. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం రజిని అభిమానుల ఎదురుచూస్తున్నారు..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది, అనుకున్న దాని కంటే నెల ముందు షూట్ ని పూర్తి చేశారు చిత్రయూనిట్.

అయితే ఈ సినిమా పై మురుగదాస్ కూడా భారీ అంచనాలు పెంచుకున్నారు. ఎందుకు అంటే ఇందులో రజినీ కోసం పాత్ర రాశారు, ఆయన ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చేశారు. ఆయన సరసన నయనతార నటించారు.ఇక బ్యూటీ నివేదా థామస్ సూపర్ స్టార్ కూతురు పాత్రలో కనిపించారట..తాజాగా ఈ సినిమా గురించి మురుగదాస్ ఓప్రకటన చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల రజినీకాంత్ డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేశాడట. ఆయన డబ్బింగ్ ఈ చిత్రానికి మరింత హైలెట్ అవుతుంది అని ట్వీట్ పెట్టారు.

అంతేకాదు వారిద్దరూ ఉన్న ఫోటో ట్వీట్ చేశారు. దీనిపై తలైవా అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక సంక్రాంతికి పాటలు దర్బార్ తో కేక పుట్టించనున్నాయి.