మ్యూజిక్ డైరెక్టర్ థమన్ భార్య ఎవరో తెలుసా

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ భార్య ఎవరో తెలుసా

0
94

థమన్ తెలుగులో ఇప్పుడు ఎక్కడ వింటున్నా ఆయన పాటలే.. దర్శక నిర్మాతలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఆయనతోనే సినిమా చేయాలి అని చూస్తున్నారు, తమన్ అసలు పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్.2008లో వచ్చిన మళ్లీ మళ్లీ సినిమాతో తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టారు.

 

చిన్నతనం నుంచి సంగీతం అంటే ఆయనకు ఇష్టం,అంతేకాదు ఆయనకు టాలీవుడ్ లో మంచి మంచి సినిమాలకు అవకాశాలు ఇచ్చారు, ఇక ఇచ్చిన అన్నీ సినిమాలకు న్యాయం చేశారు,

కిక్, ఆంజనేయులు, బృందావనం, నాయక్, దూకుడు, బిజినెస్ మాన్, మిరపకాయ్, సరైనోడు, రామయ్యా వస్తావయ్యా , రేసుగుర్రం ఇలా చాలా సినిమాలకు ఆయన సంగీతం అందించారు. ఇక తాజాగా అల వైకుంఠపురం చిత్రానికి కూడా ఆయన బాణీలు ఇచ్చారు..

 

 

తమన్ తండ్రి ఘంటసాల శివ కుమార్ ఆయన డ్రమ్మర్ గా కొన్ని వందల సినిమాలకు చేశారు, ఇక థమన్ తల్లి ఘంటసాల సావిత్రి గారు ప్రముఖ సింగర్.. ఇక చాలా మందికి తెలియంది థమన్ భార్య కూడా ప్రముఖ సింగర్.తన పేరు శ్రీ వర్ధిని. ఆమె కూడా చాలా సినిమాల్లో పాటలు పాడారు.