మ్యూజిక్ డైరెక్టర్ కుమారుడికి మెగాస్టార్ ఆఫర్

మ్యూజిక్ డైరెక్టర్ కుమారుడికి మెగాస్టార్ ఆఫర్

0
118

మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ తెలియని వారు ఉండరు.. అనేక సినిమాలకు సంగీతం అందించారు, ఎన్నోమెగా హిట్లు ఉన్నాయి, ఇప్పటీకీ బావగారు బాగున్నారా చిత్రానికి ఆయన ఇచ్చిన సంగీతం ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.. చూడాలని ఉంది, బావగారు బాగున్నారా, జైచిరంజీవ, అన్నయ్య ఈ చిత్రాలకు సూపర్ బాణీలు ఇచ్చారు.

మణి శర్మ కొడుకు మహతి స్వర సాగర్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని సినిమాలు చేసిన విషయం తెలిసిందే, ఆయన ఛలో తో మొదటి హిట్ అందుకున్నాడు. తర్వాత నితిన్ సినిమా భీష్మ తో రెండో హిట్ అందుకున్నాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్.

అయితే తాజాగా ఆయనకు అవకాశం ఇవ్వాలి అని చూస్తున్నారట చిరంజీవి… కొత్త వారికి అవకాశం ఇవ్వాలి అని చిరు ఆలోచన చేస్తున్నారట ఈసారి సినిమాలో, ఛలో సాంగ్స్ నచ్చడంతో ఈ యువ మ్యూజిక్ డైరెక్టర్ కు వేదలమ్ రీమేక్ లో ఛాన్స్ ఇవ్వనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.