టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

-

Music Director Raj |తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్(68) కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 2023, మే 21 ఆదివారం రోజున బాత్ రూమ్‌లో కాలు జారిపడి చనిపోయారు. దీంతో టాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రేపు ఫిల్మ్ నగర్ లోని మహా ప్రస్థానంలో రాజ్ అంత్యక్రియలు జరగనున్నాయి. రాజ్ పూర్తిపేరు తోటకూర సోమరాజు. ఆయన తండ్రి ప్రముఖ సంగీత దర్శకులు టి.వి.రాజు. తండ్రి సంగీత దర్శకుడు కావడంతో రాజ్ కి కూడా చిన్నప్పటి నుండి సంగీతంపై మక్కువ ఏర్పడింది. 1983లో మోహన్ బాబు హీరోగా వచ్చిన ప్రళయ గర్జన మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రాజ్(Music Director Raj). ఈ సినిమాకు కోటీ కూడా పనిచేశారు. అలా ప్రారంభమైన రాజ్-కోటీ ప్రయాణం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా మారిపోయింది. మెగాస్టార్ చిరంజీవి సహా టాలీవుడ్‌లోని అగ్ర హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...