మెగాస్టార్ చిరంజీవి సాధించిన ఈ పది రికార్డుల గురించి తప్పక తెలుసుకోండి

-

మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికి ఇష్టమే, ఆయన సినిమా వస్తోంది అంటే ఎంతో జోష్ ఉంటుంది అభిమానులకి, అందరివాడుగా అన్నయ్యగా అందరూ ఆయనని ఇష్టపడతారు, అయితే మెగాస్టార్ చిరంజీవి అనేక అవార్డులు గెలుచుకున్నారు, అంతేకాదు టాలీవుడ్ లో అత్యధిక రికార్డులు సృష్టించింది కూడా చిరంజీవి ఆయన చిత్రాలు అనే చెప్పాలి.

- Advertisement -

మరి ఆ విషయాలు వివరాలు చూద్దాం…భారత సినీ పరిశ్రమలో సౌత్ ఇండియాలో కోటి రూపాయల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న మొదటి హీరో చిరంజీవి. ఇక ఆపద్బాంధవుడు సినిమాకి కోటి ఇరవై అయిదు లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నారు ఇది రికార్డ్.

అంతేకాదు టాలీవుడ్ లో 1996 లోనే కోటి రూపాయల పైన పారితోషికం తీసుకున్న ఏకైక హీరో చిరంజీవి.
అయితే అప్పుడు అమితాబ్ చిరు మాత్రమే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారు.
ఆస్కార్ అవార్డ్స్ కి ఆహ్వానం అందుకున్న మొదటి సౌత్ ఇండియా హీరో చిరంజీవే. 1987లోనే ఆస్కార్ నుంచి చిరంజీవికి ఆహ్వానం అందింది.

అంతేకాదు చిరంజీవి సినిమాలు హాలీవుడ్ లో కూడా డబ్ అయ్యేవి. ఇండియాలో 7 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్న హీరో చిరంజీవి, ఇంద్ర సినిమాకి తీసుకున్నారు ఇది రికార్డ్ ..ఘరానా మొగుడు సినిమా పది కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది, టాలీవుడ్ లో ఇదే అత్యధిక రికార్డ్ .

టాలీవుడ్ లో మొట్టమొదటి సారిగా 30 కోట్ల కలెక్షన్స్ సాధించింది కూడా చిరంజీవే. ఇంద్ర సినిమాతో ఈ రికార్డు సాధించారు. అంతేకాదు టాలీవుడ్ లో చిరు ఒక్కరే 8 ఇండస్ట్రీ హిట్ లు సాధించారు. .ఆ చిత్రాలు చూస్తే ఖైదీ, పసివాడి ప్రాణం, యముడికి మొగుడి, అత్తకియముడు అమ్మాయికిమొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఇంద్ర సినిమాలు సూపర్ హిట్ టాలీవుడ్ లోనే హిట్ చిత్రాలుగా నిలిచాయి.

ఇక ఇండియాలో ఓ యాక్టర్ వెబ్ సైట్ ప్రారంభించడం అంటే అది చిరు అనే చెప్పాలి, ముందు చిరంజీవి పేరు మీదే ఓ వెబ్ సైట్ ఏర్పాటు అయింది..ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్ లో 7 సార్లు బెస్ట్ అవార్డు అందుకున్న తెలుగు హీరో చిరంజీవి. దాదాపు 47 సినిమాలు వంద రోజులు ఆడాయి. మన దేశంలో స్వంతంగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించిన హీరో చిరంజీవి మాత్రమే. ఇలా రికార్డుల్లో కూడా రికార్డ్ చిరంజీవిదే అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్..

మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి...

హర్మన్ ప్రీత్‌కు టీమిండియా పగ్గాలు..

న్యూజిలాండ్‌(New Zealand)తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే...