‘నాకు పర్ఫెక్ట్’.. నాగ చైతన్యతో నిశ్చితార్థంపై శోభిత

-

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపా(Sobhita Dhulipala)లకు ఇటీవల నిశ్చితార్థం జరిగింది. వీరి నిశ్చితార్థం అందరికీ ఒక షాక్‌లానే అనిపించింది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కానిచ్చేసింది అక్కినేని ఫ్యామిలీ. తాజాగా తమ నిశ్చితార్థంపై శోభితా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన నిశ్చితార్థం అలా జరగాలి.. ఇలా జరగాలని తానెప్పుడూ కలలు కనలేదని, కానీ తనకు జరిగిన నిశ్చితార్థం తనకు చాలా పర్ఫెక్ట్‌ అంటూ చెప్పుకొచ్చింది. ‘‘ఎంగేజ్‌మెంట్ కోసం ఎప్పుడూ కలలు కనలేదు. ప్లాన్స్ చేసుకోలేదు. సంప్రదాయాల ప్రకారం ఉండాలని అనుకున్నా అంతే. అనుకున్నట్లే సన్నిహితులు, కుటుంబీకుల మధ్య చాలా ప్రశాంతంగా జరిగింది’’ అని వివరించింది.

- Advertisement -

‘‘నిశ్చితార్థం సమయంలో నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. అందుకే నాది సింపుల్ నిశ్చితార్థం అని చెప్పలేను. అది నాకు పర్ఫెక్ట్ అనే చెప్తా. పెళ్ళి చేసుకోవాలి, తల్లిని కావాలని ఎప్పుడూ కోరుకునేదాన్ని. మాతృత్వం అంటే నాకెంతో ఇష్టం. నేను నా తల్లిదండ్రులు, సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తాను. ఇవన్నీ ఎప్పుడూ నాతోనే ఉండాలని కోరుకుంటాను’’ అని శోభిత(Sobhita Dhulipala) తెలిపింది.

Read Also: మనం తినే తీరు మన గురించి చెప్పేస్తుందా?
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Coconut Milk Benefits | చలికాలంలో కొబ్బరి పాలతో పసందైన ఆరోగ్యం..

Coconut Milk Benefits | చలికాలం వస్తోందంటే రోగాలు ఎటాక్ చేయడానికి...

Sonu Sood | ఆ రోల్ కోసం చాలా కష్టపడ్డా: సోనూ సూడ్

సోనూ సూద్(Sonu Sood) అనగానే కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరో...