బాలీవుడ్ నటుడు సైప్ అలీఖాన్ ఎక్కువగా వార్తల్లో నిలవరు ఆయన గురించి సినిమా వార్తలు ఎక్కువగా వినిపిస్తాయి, ఫ్యామిలీ విషయాలు కూడా ఎప్పుడూ బయటకు ఆయన చెప్పరు, అయితే ఆయన రెండు వివాహాలు చేసుకున్నారు అనేది తెలిసిందే, ముందు ఆయన నటి అమృతా సింగ్ ను పెళ్లి చేసుకున్నారు, కాని తర్వాత 13 ఏళ్లకు విడాకులు తీసుకున్నారు.
తర్వాత సైఫ్ రోసా క్యాటలానోతో కోన్నాళ్లు డేటింగ్ చేశాడు. తర్వాత హీరోయిన్ కరీనాకపూర్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. సైఫ్ అలీఖాన్-అమృతాసింగ్ విడాకుల అంశం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఆయన పలు విషయాలు చెప్పుకొచ్చారు ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి.
నా మొదటి భార్య నా పిల్లలని నన్ను కలవనివ్వదు, నా భార్య ఆలోచన వేరు నా ఆలోచన వేరు, తన ఆలోచనలకు గౌరవం ఇస్తాను అన్నాడు సైఫ్…. నా పర్సులో కుమారుడు ఇబ్రహీం ఫొటో ఉంటుంది. ప్రతీసారి ఆ ఫొటోను చూస్తుంటా. నాకు ఏడుపొచ్చేది. నా కూతురు, కొడుకు ఎప్పుడూ మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ ఉంటుంది. తను బిజీగా ఉన్న సమయంలో పిల్లలని కుటుంబ సభ్యులకి మాత్రమే ఇచ్చేది, నా దగ్గరకు పంపేది కాదు అని పలు విషయాలు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆయన.