‘మిస్టర్ బచ్చన్(Mr.Bachchan)’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse). తొలి సినిమాతోనే తెలుగు తమ్ముళ్ల మనసును కూడా మెలిపెట్టేసిందీ చిన్నది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్‌ల లిస్ట్‌లోకి చేరిపోయింది. ప్రతి ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా తమ సినిమాలోకి భాగ్యశ్రీని తీసుకునే భాగ్యం కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగు తమ్ముళ్లలో కూడా భాగ్యశ్రీకి ఒక్క సినిమాతోనే మంచి ఫాలోయింగ్ వచ్చింది. దీంతోనే తాజాగా అమ్మడు.. ఇన్‌స్టాలో అభిమానులను ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టారు.
‘‘నన్ను మీ ఇంటిని ఆడపిల్లలా ఆదరించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. జిక్కీ పాత్రపై మీరు చూపిన ప్రేమాభిమానాలు ఊహించలేదు. నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నా తర్వాతి ప్రాజెక్ట్‌ల గురించి మీతో పంచుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తా’’ అని భాగ్యశ్రీ(Bhagyashri Borse) పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు తనను ఇంతలా ఆదరిస్తారని తాను కలలో కూడా అనుకోలేదని, వీరి అభిమానం ఎంతో సంతోషాన్నిస్తుందని రాసుకొచ్చింది.