లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ ఈ సినిమా టాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది, ఈ సినిమాతో హీరోగా పరిచయమైన యువ నటుడు అభిజీత్. తర్వాత సూపర్ హిట్ సినిమాలు చేశాడు, తర్వాత పలు వెబ్ సిరీస్ లు నటించాడు, అయితే ఈ మధ్య బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాడు అభిజిత్.. తన ఆటతో అదరగొడుతున్నాడు అనే చెప్పాలి.
పెద్దగా ఫిజికల్ టాస్క్లు చేయకపోయినా మైండ్ గేమ్ తో అదరగొట్టాడు. ఇక అభిజిత్ కు ఫ్యాన్స్ బాగానే ఉన్నారు, ముఖ్యంగా ఈసారి టైటిల్ విన్నర్ అతనే అనే వార్తలు వినిపించాయి.. ఇక అతనికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెరుగుతోంది.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తాజాగా తన సోషల్ మీడియా పేజ్ ద్వారా అభికు మద్దతు ఇస్తున్నట్టు పేర్కొన్నాడు….మై బాయ్స్కి ఎప్పుడు శుభాకాంక్షలు ఉంటాయి అని పోస్ట్ పెట్టాడు, ఇక అభిజిత్ కు విజయ్ దేవరకొండ మధ్య స్నేహం ఉంది
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంలో అభిజీత్ హీరోగా కనిపించగా, విజయ్.. గోల్డ్ ఫేజ్ కుర్రాడి పాత్రలో కనిపించి మెప్పించారు. ఇప్పటికే చాలా మంది అభికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే..