కరోనా ప్రభావం దాదాపు 200 దేశాలకు తాకింది.. ఇక మన దేశంలో కూడా లాక్ డౌన్ ప్రకటించారు.. ఈ సమయంలో చాలా మంది విదేశాల్లో చిక్కుకుపోయారు…. అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా నిలిచిపోవడంతో.. విదేశాల్లో ఉన్నవారు అక్కడే ఉండాల్సి వచ్చింది.
ఈ క్రమంలోనే హీరో మంచు విష్ణు భార్య విరానిక, పిల్లలు అరియానా, వివియానా, అవ్రామ్, ఐరావిద్య విదేశాల్లో ఉండిపోవాల్సి వచ్చింది. తాజాగా ఈ విషయాన్ని విష్ణు తెలిపారు. తన భార్య పిల్లలను చాలా మిస్ అవుతున్నాను అని తెలిపారు.
ఇలా చాలా మంది తనలా బాధపడుతున్నారు అని తెలిపారు, కాని ఇది చాలా ముఖ్యమైన సమయం అని అందరూ ఇలా లాక్ డౌన్ పాటించాలి అని తెలిపారు ఆయన. నా భార్య, పిల్లలు వేరే ఊరిలో ఉన్నారు. వాళ్లు ఇక్కడికి వచ్చిన తర్వాత గడ్డం తీస్తాను. ఫిబ్రవరి చివరి వారంలో మా ఫ్యామిలీ మెంబర్‌కు ఆరోగ్యం బాగోలేక సర్జరీ కోసం వేరే దేశానికి వెళ్లాం… నేను నాన్న అమ్మ వచ్చేశాం, వారు కొన్ని రోజులు ఉండి వస్తాము అన్నారు అలా చిక్కుకున్నారు అని తెలిపారు.