నా కోరిక తీరింది..లైగర్ పై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు

0
102
Vijay Deverakonda

స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా మూవీ లైగర్. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. మైక్ టైసన్, రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో రౌడీ హీరో బాక్సర్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది.

పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి.  ‘లైగర్’ ఆగస్టు 25న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్.

ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు విజయ్.  దేశవ్యాప్తంగా లైగర్​ సినిమా ఓ సంచలనం సృష్టిస్తుందని, దేశవ్యాప్తంగా తనపై యువత చూపిస్తోన్న ఆదరణ ఎప్పటికీ మరిచిపోలేనని, అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందన్నారు. పెళ్లి చూపులు లాంటి చిన్న సినిమాలే చేయాలనుకున్న కానీ లైగర్ లాంటి పాన్ ఇండియా మూవీ చేస్తానని అనుకోలేదు. ఈ సినిమాతో ఇండియా మొత్తం ఫ్యాన్స్ ను సంపాదించుకున్న దీనితో నా కోరిక నెరవేరిందని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.