మైత్రీతో మెగాస్టార్ – మ‌రో డైరెక్ట‌ర్ తో చిత్రం ఫిక్స్ అయిన‌ట్టేనా

మైత్రీతో మెగాస్టార్ - మ‌రో డైరెక్ట‌ర్ తో చిత్రం ఫిక్స్ అయిన‌ట్టేనా

0
94

మైత్రీ సంస్ధ తెలుగులో సినిమాలు వ‌రుస పెట్టి సిద్దం చేస్తోంది, అంతేకాదు కొత్త ప్రాజెక్టుల కోసం డిస్క‌ష‌న్స్ కూడా చేస్తున్నారు, ఇక ఒకేసారి మూడు ప్రాజెక్టులు పూర్తి చేసేలా ఉంది అని చెప్పాలి.
పవన్ కళ్యాణ్ తో సినిమా లైన్ లో వుంది. 2021లో ఈ సినిమా వుండొచ్చు. ఈలోగా మరో మెగా హీరో బన్నీ-సుకుమార్ సినిమా ఉంది,

ఈ స‌మ‌యంలో మ‌రో మెగా చిత్రం వీరి చేతిలో రెడీ అవ్వనుంది అంటున్నారు, . మెగాస్టార్ చిరంజీవి తనతో ఓ సినిమా చేసుకునేందుకు మైత్రీ మూవీస్ కుఅంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. డైరక్టర్ పక్కాగా ఫిక్స్ కాకపోయినా, బాబీ పేరు వినిపిస్తోంది. ఈ విషయంలో ఇంకా పూర్తిగా సమాచారం బ‌య‌ట‌కు రావ‌డం లేదు కాని మెగాస్టార్ తో బాబి సినిమా ఉంటుంది అంటున్నారు.

ఇలా మెగా ఫ్యామిలీలతో వ‌రుస‌గా మూడు పెద్ద సినిమాలు చేస్తున్నారు ఈ సంస్ధ వారు. యంగ్ హీరోలు, నాని, విజయ్ దేవరకొండ సినిమాలు కూడా ఇదే టైమ్ లో ప్లానింగ్ లో వున్నాయి. మహేష్ బాబు-పరుశురామ్ చిత్రం కూడా డిస్క‌ష‌న్స్ లో ఉంది ..సో మొత్తానికి మైత్రీ వారి ప్లాన్స్ భ‌లే ఉన్నాయి అంటున్నారు టాలీవుడ్ అన‌లిస్టులు.