నా బ్యూటీ సీక్రెట్ కు అదే కారణం అనసూయ

నా బ్యూటీ సీక్రెట్ కు అదే కారణం అనసూయ

0
85

జబర్ధస్త్ నుంచి యాంకర్ గా మంచి పేరు సంపాదించింది అనసూయ, ఆ తర్వాత ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు, ముఖ్యంగా రామ్ చరణ్ తో చేసిన రంగస్ధలం సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చింది, అందులో రంగమ్మత్త పాత్ర అద్బుతంగా చేశారు అనే చెప్పాలి, ఇటు ఎప్పుడూ ప్రతీ అంశంలో సోషల్ మీడియాలో ఆమె స్పందిస్తారు.

తన గురించి అనేక విషయాలు అభిమానులతో పంచుకుంటారు, ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇన్ని రోజులు అయినప్పటికీ.. అనసూయ గ్లామర్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో అనసూయ తన చర్మ సౌందర్యానికి గల కారణాన్ని చెప్పుకొచ్చింది.

దీంతో ఆమె అభిమానులు ఆమె చెప్పిన విషయం గురించి చర్చించుకుంటున్నారు, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగుతానని అభిమానులతో షేర్ చేసుకుంది. రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదని చెప్పింది. అంతేకాదు రెడ్వైన్ గుండెకు చాలా మంచిదని వివరించింది. అంతేకాదు రెడ్ వైన్ తాగితే కలర్ వస్తారు అంటోంది అనసూయ.