నా సినిమాకి అందుకే గ్యాప్ వచ్చింది అదే రీజన్ అల్లు అర్జున్

నా సినిమాకి అందుకే గ్యాప్ వచ్చింది అదే రీజన్ అల్లు అర్జున్

0
78

అల వైకుంఠ పురములో చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ లో అనేక విషయాలు తన మనసు విప్పి మాట్లాడారు బన్నీ, అయితే ఎందుకు బన్నీ ఇంత గ్యాప్ తీసుకున్నారు. తదుపరి చిత్రానికి అని చాలా మంది అనుకున్నారు. దానికి సమాధానం చెప్పాడు ..తనకు చాలా గ్యాప్ వచ్చిందని, సరైనోడు, డీజే చిత్రాల తర్వాత ఆహ్లాదకరంగా ఉండే సినిమాలో నటించాలని కోరుకున్నానని అదే కారణంతో గ్యాప్ తీసుకున్నాను అన్నాడు.

కానీ ఫ్యాన్స్ కారణంగా గ్యాప్ వచ్చిన సంగతే తెలియలేదని అన్నారు. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు కానీ తనకు మాత్రం ఆర్మీ ఉందన్నారు. ఇవాళ స్టేజ్ పై ఎవరూ లేకుండా నిల్చున్నానంటే అందుకు కారణం మీరేనంటూ అభిమానులను ఆనందోత్సాహాల్లో ముంచెత్తారు.

నా కోసం ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏం చెబుతానా ఏం చేస్తున్నానా అని సెర్చ్ చేస్తారు అన్నా ఎప్పుడు సినిమా చేస్తున్నావు నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమిటి అని అడుగుతారు. మీరందరూ నన్ను ఇంత స్ధాయికి తీసుకువెళ్లారు అని అన్నారు.