నభా నటేశ్ చెప్పిన సీక్రెట్ వింటే నిర్మాతలు షాక్ అవ్వాల్సిందే

నభా నటేశ్ చెప్పిన సీక్రెట్ వింటే నిర్మాతలు షాక్ అవ్వాల్సిందే

0
91

తెలుగులో ఈ మధ్య మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్లలో నభా నటేశ్ ఒకరు..ఇస్మార్ట్ శంకర్’ తో సక్సెస్ ను అందుకున్న ఈ సుందరిని, డిస్కోరాజా పలకరించింది, అయితే ఈ సినిమా అనుకున్నంత హిట్ అవ్వలేదు.. కాని నటనకు ఆమెకు మంచి మార్కులు పడ్డాయి. త్వరలో సోలో బ్రతుకే సో బెటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా ఇంటర్వ్యూలో .. పారితోషికానికి సంబంధించిన విషయాన్ని గురించిన ప్రస్తావన రావడంతో తనదైన శైలిలో స్పందించింది. అయితే చాలా మంది హీరోయిన్లు పారితోషికం విషయంలో ఎక్కువగా ఏమీ చెప్పరు, తాజాగా ఆమె పారితోషికం గురించి చెప్పింది.

సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకి నేను పారితోషికం పెంచేసినట్టుగా .. నిర్మాతలను గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇది కరెక్ట్ కాదు అని అసలు నాకు ఎంత తీసుకోవాలో తెలుసు, ఎంత నాకు ఇవ్వాలో నిర్మాతలకు తెలుసు అని చెప్పింది ఈ భామ. నేను ఏ నిర్మాతని ఇబ్బంది పెట్టను ఎవ్వరిని డిమాండ్ చెయ్యను అని తెలిపింది నభానటేశ్.