నదియా-టబు – ఆ దారిలో మరో నటిని తెరపైకి తెస్తున్న త్రివిక్రమ్

నదియా-టబు - ఆ దారిలో మరో నటిని తెరపైకి తెస్తున్న త్రివిక్రమ్

0
110

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాల్లో క్యారెక్టర్లు అద్బుతంగా ఎంచుకుంటారు, అంతేకాదు ఆ పాత్రకు వారు సెట్ అవుతారా లేదా అనేది ముందు ఆలోచించి వారిని ఫైనల్ చేస్తాడు, గతంలో టాప్ హీరోయిన్స్ గా ఉన్న వారిని ఇప్పుడు త్రివిక్రమ్ యంగ్ హీరోలకి తల్లులుగా, అత్తలుగా తీసుకువచ్చి మంచి క్రేజ్ తీసుకువస్తున్నారు, వారు ఆ పాత్రల్లో అద్బుతంగా నటిస్తున్నారు.

అలా చెబితే అత్తారింటికి దారేది సినిమాలో నదియా, ఆ తర్వాత అల వైకుంఠపురములో టబు ఇలా ప్రతి సినిమాలో మంచి రోల్స్ వారికి ఇచ్చారు, ఇక తాజాగా తారక్ తో కలిసి ఓ సినిమా చేయనున్నారు, ఈ సినిమాలో కీలక పాత్ర కోసం మరో సీనియర్ నటిని తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి, ఆమె ఎవరో కాదు నటి రమ్యకృష్ణ, ఆమె ఈ సినిమాలో కీలక పాత్ర చేసే అవకాశం ఉందట.

అంతేకాదు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఇందులో సీనియర్ పొలిటీషియన్ గా నటించనున్నారు, ఈ సినిమా పొలిటికల్ టచ్ ఉండే సినిమా అయిననుపోయి రావలెహస్తినకు అనే టైటిల పరిశీలనలో ఉంది, మరి దీనిపై ఇంకా ప్రకటన అయితే రావాల్సి ఉంది.. చిత్ర యూనిట్ మాత్రం బ్యాగ్రౌండ్ వర్క్ అయితే చేసుకుంటోందట.