ప్రభాస్ పై అర్షద్ వ్యాఖ్యలు.. నాగ్ అశ్విన్ పవర్ ఫుల్ రిప్లై

-

Nag Ashwin – Arshad Warsi | ప్రభాస్ ఫైట్ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరోసారి టాలీవుడ్ బాలీవుడ్ వివాదాన్ని రాజేశాయి. కల్కి మూవీలో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. ప్రభాస్ ఎదుగుదలను ఓర్చుకోలేని బాలీవుడ్ నటులు అవకాశం దొరికినప్పుడల్లా ఆయనపై విషం చిమ్ముతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ వివాదంలో టాలీవుడ్ నటులు ప్రభాస్ కి మద్దతు పలుకుతున్నారు. ప్రభాస్ లాంటి హీరో పై ఇలాంటి వ్యాఖ్యలు వారి కుంచిత బుద్ధికి నిదర్శనం అంటున్నారు. అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో తప్పులేదు.. కానీ, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నామనే స్పృహ కలిగి ఉండడం అవసరమని హితవు పలుకుతున్నారు.

- Advertisement -

ఇక ఈ క్రమంలో కల్కి మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) కూడా అర్షద్ వార్సి వ్యాఖ్యలపై స్పందించారు. ఎక్స్ లో ఓ అభిమాని చేసిన ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. అర్షద్ కి చెంప చెళ్ళుమనే కౌంటర్ ఇచ్చారు. “మళ్లీ మనం వెనక్కి వెళ్లొద్దు. నో మోర్ నార్త్ సౌత్, బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఒక్కటయ్యింది. అర్షద్ సాబ్ మాట్లాడేటప్పుడు కొన్ని మంచి పదాలు చూజ్ చేసుకోవాల్సింది. అయినా ఏం పర్లేదు. ఆయన పిల్లలకు కొన్ని ‘బుజ్జి’ బొమ్మలు పంపిస్తున్నా. నేను బాగా కష్టపడతాను. ‘కల్కి 2’ లో ఎప్పుడూ చూడని బెస్ట్ ప్రభాస్(Prabhas) ని చూపిస్తాను” అంటూ రిప్లై ఇచ్చారు.

Read Also: నాగార్జునకి భారీ షాక్.. N కన్వెన్షన్ కూల్చివేత
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...