నాగ్ కొత్త సినిమా టైటిల్ ఇదే అదిరిపోయింది

నాగ్ కొత్త సినిమా టైటిల్ ఇదే అదిరిపోయింది

0
93

కింగ్ నాగార్జున తన సినిమాల జోరు పెంచారు ..మన్మధుడు సినిమా తర్వాత చేసిన చిత్రం తాజాగా ఒక షెడ్యూల్ కూడా ఫినిష్ చేసుకుంటోంది.. అయితే మన్మధుడు చిత్రం అలరిస్తుంది అనుకున్న సమయంలో అది పెద్ద డిజాస్టర్ అయింది, దీంతో ఆయన తదుపరి చిత్రం పై బాగా ఫోకస్ చేశారు.

తాజాగా ఆయన కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు సాల్మన్ దర్శకత్వంలో నాగ్ ప్రస్తుతం వైల్డ్ డాగ్ చిత్రం చేస్తున్నాడు. తాజాగా దీని మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఇది యాక్షన్ ప్రధాన చిత్రమని నాగ్ లుక్ చూస్తేనే అర్థమవుతుంది. టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు చిత్రానికి .

మొత్తానికి నాగ్ సరికొత్త కథతో వస్తున్నారు అని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో నాగ్ పాత్ర పేరు విజయ్ వర్మ. ఇది ఓ ఎన్ఐఏ అధికారి కథ. కావాల్సినంత యాక్షన్ మసాలా ఉంటుందనడంలో సందేహం అక్కర్లేదు. మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతోంది 2020 మార్చిలో సినిమా విడుదల ఉంటుంది అంటున్నారు చిత్ర యూనిట్ .