చైతు సినిమా విడుదల కు నోచుకునేనా..!!

చైతు సినిమా విడుదల కు నోచుకునేనా..!!

0
77

అక్కినేని నాగ చైతన్య గత కొన్ని సినిమాలుగా పరాజయాన్ని చవి చూస్తున్నాడని చెప్పాలి.. ఆయన తాజాగా వెంకటేష్ కలిసి వెంకీ మామ అనే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో చైతు సరసన రాశికన్నా, వెంకీ సరసన పాయల్ నటిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ చివరి స్టేజి కి రాగ, చైతు హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసందే..

నెల రోజుల కిందట అఫీషియల్ గా ప్రారంభమైన ఈ సినిమా ఓపెనింగ్ అప్పుడే ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ చేస్తాం అని ప్రకటించారు. కానీ ఇప్పుడు అనుకున్న డేట్ కి రాలేకపోతున్నారు.. అన్ని కుదిరితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.

అయితే ఇలా జరగడం వల్ల చైతు కి కలిసొచ్చింది. ఎందుకంటే వెంకిమామ కూడా డిసెంబర్ లోనే రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఒకవేళ శేఖర్ కమ్ముల సినిమా వెంకిమామ రెండు సినిమాలు డిసెంబర్ లో వస్తే చైతు కి ఇబ్బందిగా మారేది. సో ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు.