అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు. వారి వివాహ వేడుక అన్నపూర్ణ స్టోడియోస్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. టెంపుల్ థీమ్ సెటప్‌తో వారి వివాహం అచ్చ తెలుగు సాంప్రదాయం ప్రకారం జరిగింది. రాత్రి 8:13 గంటల శుభముహూర్తాన వీరి దాంపత్య బంధంలోకి అడుగు పెట్టారు. ఈ వివాహ వేడుక తెలుగు పెళ్ళి సాంప్రదాయానికి అద్దం పడుతోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల నడుమ నాగచైతన్య, శోభిత ఏడడుగులు వేశారు.
ఈ వేడుకకు చిరంజీవి దంపతులు, వెంకటేష్, అల్లు అర్జున్, సుబ్బరామిరెడ్డి, ఎన్‌టీఆర్, రామ్ చరణ్, రాణా, అల్లు అర్వింద్, కీరవాణి, సుహాసిని సహా పలువురు ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు. నవ దంపతులను ఆశీర్వదించారు. అంతేకాకుండా ఈ కొత్త జంటకు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే నాగచైతన్య(Naga Chaitanya), శోభిత నిశ్చితార్థం ఆగస్టు నెలలో జరిగింది. అప్పటి నుంచి వీరిద్దరు మూడుముళ్ల బంధంలోకి ఎప్పుడెప్పుడు అడుగు పెడతారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు నేటితో తెరపడింది.
Read Also: రాష్ట్ర అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం: రేవంత్ రెడ్డి
Follow us on: Google News, Twitter, ShareChat