Naga Chaitanya – Sobhita | నాగచైతన్య-శోభితల హల్దీ ఫంక్షన్.. ఫొటోస్ వైరల్

-

నాగచైతన్య – శోభిత(Naga Chaitanya – Sobhita) జంట త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. డిసెంబర్ 4 న అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే వేడుకకి సంబంధించిన కార్యక్రమాలన్నీ మొదలయ్యాయి. సంప్రదాయబద్ధంగా పసుపు దంచడంతో ప్రారంభమైన పెళ్లి పనులు, నేడు కాబోయే వధూవరులకు పసుపు రాసి మంగళ స్నానాలు చేయించే వరకు వచ్చాయి. ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -

Naga Chaitanya Sobhita | నాగ చైతన్య తెల్ల కుర్తా ధరించగా, శోభిత ఎరుపు చీరలో ముస్తాబైంది. వీరిద్దరికీ కుటుంబసభ్యులు అక్షింతలు వేస్తున్న ఫోటో ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. మరి కొన్ని ఫోటోలలో శోభిత పసుపు చీర మడికట్టులో పూజలు చేస్తూ కనిపించింది. ఆమెకి మంగళ స్నానాలు చేయిస్తున్న ఫోటోలు సైతం బయటకి వచ్చాయి. కాగా, సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య, శోభిత రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు.

Read Also: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...

Kingfisher Beer Supply | కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ షాక్

Kingfisher Beer Supply | తెలంగాణలోని కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ...