Thandel Release Date | ‘తండేల్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇలా కూడా డిసైడ్ చేస్తారా..!

-

నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న సినిమా ‘తండేల్’. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అదే విధంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై(Thandel Release Date) కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఈ అయోమయానికి మూవీ మేకర్స్ తాజాగా ఫుల్‌స్టాప్ పెట్టారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో లేదు అలాగని సమ్మర్‌కు రావట్లేదన్నారు. అటు ఇటు కాకుండా ఈ మూవీని ఫిబ్రవరి 7న విడుదల చేయాలని నిర్ణయించినట్లు నిర్మాత అల్లు అరవింద్ అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమా రిలీజ్‌డేట్ ఫిక్స్ చేసిన తీరు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన వీడియోలో ‘ఇదేందయ్యా ఇది.. నేనెప్పుడూ చూడలే’ అన్న అల్లు అరవింద్ మాటలు అందరినీ నవ్విస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..

- Advertisement -

ఒక సినిమా రిలీజ్ డేట్‌(Thandel Release Date)ను ఫిక్స్ చేయడం అంటే ఒక మినీ వార్ అనే చెప్పాలి. వేరే ఏ సినిమాతో క్లాష్ కాకుండా, సినిమాకు ప్రేక్షకులు వచ్చేలా ఉండాలి. దానికి తోడు ఒక స్పెషల్ వెకేషన్ కూడా ఉండాలి. ఇలా మరెన్నో అంశాలను దృష్టిలో పెట్టుకుని మూవీ మేధావులు రోజుల పాటు కొన్ని సందర్భాల్లో నెలలపాటు తర్జనభర్జన పడి నిర్ణయిస్తారు. కానీ తండేల్ విషయంలో మాత్రం అదేమీ లేదు. చాలా సింపుల్‌గా తేల్చేశారు. ఈ సినిమా రిలీజ్‌ డేట్ ఫిక్స్ చేయడం కోసమే మూవీ టీమ్ అంతా కలిసి ఒక గేమ్ ఆడారు. టగ్ ఆఫ్ వార్ తరహాలోనే ‘టగ్స్ ఆఫ్ తండేల్’ అని గేమ్ పెట్టారు. ఇందులో సంక్రాంతి, సమ్మర్ అన్న పేర్లతో రెండు టీమ్స్‌ను పెట్టారు. కానీ ఈ గేమ్‌లో ఏ జట్టూ గెలవకపోవడంతో సంక్రాంతి, సమ్మర్ మధ్యలో ఉన్న ఫిబ్రవరిని ఫిక్స్ చేశారు. అలా ఈ సినిమా డేట్‌ను ఫిక్స్ చేస్తున్న వీడియోను వాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ వీడియోకు ‘ఇదేందయ్యా ఇది.. ఇది నేను ఎప్పుడూ చూడలే’ అన్న అరవింద్(Allu Aravind) డైలాగ్ అటేన్షన్ గ్రాబర్‌గా నిలిచింది.

Read Also:  షారుఖ్ ఖాన్‌కు బెదిరింపులు.. ఎంత డిమాండ్ అంటే..?
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...