లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సూపర్ హిట్ అవుతుంది – మెగా బ్రదర్

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సూపర్ హిట్ అవుతుంది - మెగా బ్రదర్

0
126

రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 22న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ మూవీపై నాగబాబు తన అభిప్రాయాన్ని తెలిపారు. రాంగోపాల్ వర్మ అంటే తనకు వ్యక్తిగతంగా గౌరవం లేదని, అయితే ఆయన తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మాత్రం పక్కా విజయం సాధిస్తుందని నాగబాబు చెప్పారు. ‘

అంతే కాకుండా తాను కథానాయకుడు’, ‘యాత్ర’ సినిమాలు చూడలేదన్న ఆయన ఎన్టీఆర్ గారి జీవితంలో ఒడిదుడుకులు లేవన్నారు. ఆయన ఎప్పుడు సక్సెస్ ఫుల్ హీరో అని చెప్పుకొచ్చారు. కానీ, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆయనకు కష్టాలు మొదలయ్యాయన్నారు. వర్మ తీసుకున్న పాయింట్ అక్కడ్నుంచే కాబట్టి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ ఉంటుందని నమ్ముతున్నట్లు నాగబాబు తెలిపారు.మరి నాగబాబు చెప్పినట్లు ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందో లేదో చూడాలి.