పవన్ రీ ఎంట్రీపై నాగబాబు ఎమన్నాడంటే..!!

పవన్ రీ ఎంట్రీపై నాగబాబు ఎమన్నాడంటే..!!

0
141

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు చాల మంది ఉన్నారు. అందులో స్పెషల్ గా పవన్ కళ్యాణ్ కనిపిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయనకి సాదారన ప్రజలే కాదు ఇండస్ట్రిలో చాల మంది యువ హీరోలు కూడా అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాన్ మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డా తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరుచుకుని తనకు సాటి ఎవరు లేరని నిరూపించుకున్నాడు. వరుస విజయాలతో పవర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిపోయారు. గబ్బర్ సింగ్ తర్వాత ఆయన ‘జనసేన’పార్టీ స్థాపించారు. నాటి నుంచి సినిమాలకు కాస్త దురంగా ఉన్న పవన్ చివరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి. ఈ సినిమా తర్వాత ఏపిలో ఎన్నికలు రావడంతో జనసేన పార్టీ తరుపు నుంచి ఆయన ముమ్మరంగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు.

ఆయన సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీ తరుపు నుంచి ఎంపీగా పోటీలో నిలబడ్డారు. తాజాగా నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..2009లో ప్రజారాజ్యం తరఫున ఓటమిని ఫేస్ చేశామని నాగబాబు తెలిపారు. అప్పుడు తమ సన్నద్ధతకు, ఇప్పుడున్న సన్నద్ధతకు తేడా స్పష్టంగా ఉందన్నారు. ఈసారి జనసేనకు ఓటేయాలన్న భావన ప్రజల్లో బలంగా కనిపించిందని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ ను ఎవరు విమర్శించినా అది ఆయనకు ప్లస్ అవుతుందని స్పష్టం చేశారు. ఇక పవన్ కళ్యాన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా అన్న ప్రశ్నకు..ఎన్టీఆర్, చిరంజీవి ఇలా ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమాల్లో నటించారు. ఎవరికీ ఇక్కడ ప్రత్యేకమైన రూల్ అంటూ ఏమీ ఉండదు కదా అని ప్రశ్నించారు. నాగబాబు జవాబుని బట్టి త్వరలో పవన్ రీ ఎంట్రి ఇస్తాడని తెలిసిపోయింది.